పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రం 2]

భారత రమణి

157


కలుగనంతకాలము వారిని రక్షించుట కిట్టి యోగములుండి తీరవలయు. ఏలయన వారు తమ్ము తాము రక్షించుకొన నెరరు.

విన--పురుషు లంత నీచు లంటివే, వివాహ మేల చెసుకొంటివి?

సుశీ-- ఇది వివాహమా? కాదు కాదు. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క పురుషు నాశ్రయించి వాని యాజ్ఞలను పాలించుచు, వానిసేవ చేయుచుండును; దానికిమారుగ అతడామెకు అన్నవస్త్రముల నిచ్చుచుండును. ఇది నింద్యమగు దాస్యము కాని, యోగ్యమైన వివాహము కాదు. (వినోదిని వచ్చును)

విన--యోగ్యమైన వివాహ మెట్టిది?

సుశీ--స్త్రీపురుషులు సమకక్షులనియు, వారియందెట్టి ఎచ్చుతగ్గులును లేవనియు భావన ప్రబలి, వివాహము లాలసాప్రేరితము కాక ప్రేమకల్పితమై, మగవాని విలాసమునకును ఆడదాని అన్నోదకములంకును వివాహ మేకాధారము కాకయుండిన వివాహము యధార్ధమైన వివాహమునజెల్లును.

విన--అదెట్లు!

సుశీ--దంపతులప్రేమ నిష్కామమై, నిర్మమమై, నిర్ముక్తము కావలయు. ప్రేమ ఉత్కటము కాక ధీరమై, శాంతమైఉండవలయు. సంశయము, ఉద్రేకము, అసహనము, విరహము అందుండరారు. అది ఆకాశమువలె స్వచ్చమై