పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

158

భారత రమణి

[అం 5


సముద్రమువలె గంభీరమై, పర్వతమువలె అచలమై యుండవలయును.

వినో--చెల్లెలా, నీవు చెప్పునది ఆదర్శ ప్రేమ. ఈ కాలమున నట్టిది సమకూరదు. జరుగనెరనిది జతపడు టెట్టులు! ద్వంద్వసమ్మిళితమై యుండుటచేతనె ఈలోకము మధురమగు చున్నది. చెడ్డ--మొదలగునాటి చేతనే ఈ సంసారము మధురమై, సర్వజనాభిలషిత మగుచున్నది. ఇందు గెల్చి మంచివార మనిపించుకొనినచో స్వర్గము మనకు కరగతమగును. భోజనమునకు వేళస్ మీరినది రండు. (పోవును)

(కేదారుడు తొందరగా వచ్చును)

కేదా-- ఏదీ బిడ్డ? ఇందెవ్వరును లేరు! పాట వినిపించుటకు సదానందుని సామాకుల పిల్చుకొని వచ్చితిని. ఆహా! సదానందుడు రచించిన ఆపాట ఎంత హృద్యముగా నున్నది!...ఏదీ!...చిరము జీవింపుము...ఆపైని..ఆ.. భారతరమణీ.. తరువాత.. ఏదో ...ప్రవరా! అని వచ్చును. నాకు స్మృతిశక్తి సన్నగిల్లినది...బుద్ధి....అసలే పూజ్యము...

(పరమానందుడు వచ్చును)

సదా-- అక్కఱలెదు. మహోదరహృత్సంపదచేతనే నీవు పృధ్వినెల్ల జయించితివి! పురాణమ్లయం దనేక చరిత్ర ములున్నవి. ఇతిహాసములందు మరికొన్ని కలవు. కాని ఇట్టి