పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
156

[అం 5

భారత రమణి

రావణుని లంక ధ్వస్తముకాలేదా? నారీకటాక్షవీక్షణా ప్రభావమున నెందరెందరో దైత్యులు పరాజితులు కాలేదా?

సుశీ--పురుషుల కృపను ఆధారముగా గొని స్త్రీ జాతి జీవింపవలయును. ఇదే బహుదు:ఖహేతువు.

విన--ఇందు పురుషుల నేర మేమి?

సుశీ--లేదు లేదు. నెరము వారిది కాదు. పురుషుల కాహారముగా పరమేశ్వరుడు స్త్రీలను సృజించెను. పురుషులేమి చేయుదురు? వారును శక్తివంచనలేక సర్వేశ్వరుని అవిచారమునకు యధాసంబవ ప్రతీకార మొనర్చుచునే యున్నారు. కావుననే వారు స్త్రీల నాదరించుట, గృహలక్ష్ములని గౌరవించుట సంభవించు చున్నది. ఇదంతయు వారి కృపగాదా?

విన-- కృపమా?

సుశీ--కాకున్న!... బాల్యవివాహము, అంత;పుర నిర్బంధము (ఘోషా) మొదలగునవి స్త్రీజాతియెడ పురుషులొనర్చు అత్యాచారములని భావించుచుంటిని కాని, లంపటలు, రక్తపిపాసువులు నగు పురుషాధముల బారినుండి సహజ కోమమలగు స్త్రీజనమును రక్షించుకొర కొనర్చిన అహ: కృత్యములని యిప్పు డెరింగితిని. మన యాచారములు కుసంస్కారము లనరాదు. పురుషులు నీచులు, లంపటలు, వ్యభిచారులు నగునంతకాలము, సంఘము అధ:పతితమై యుందు నంత వరకు--స్త్రీలకు దేహదార్ధ్యము, మనోబలమును