పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

145

భారత రమణీ

వినన కెట్టి ఆపదయు మూడదు. దూరమున నుండి నేనంతయు చూచుచుంటిని.

సుశీ--నే నింటికి పోను

సదా--ఇటనుండి నీవేమి సేయగలవు?

సుశీ--నాకును తెలియును.

సదా-- వినయుడు నా కుమారుడు, వాని రక్షించు భారము నాది. దైవము తోడు-ఇక నీ వింటికిపొమ్ము, ఇచ్చట నుండవలదు.

కేదా--వింటివా! సుశీలా! సదానందుడు ప్రమాణము చేసి చెప్పుచున్నాడు, వినయు డాతనికి కొడుకు అతని కెట్టి ఆపాయమును చేకూరదు. నేను ప్రమాణము చేసి చెప్పుచున్నాను, నీవు నాకుతురవు. లేకున్న నీపైనా కనురాగమేల జనించె! నీకెట్టి భీతియు వలదు. నాయింటికి రమ్ము. (పోవును)

సదా--నాయనా! దెబ్బ మోపుగా తగిలెనా?

విన-- లేదు, లేదు. ఎవరో వచ్చుచున్నారు (పోలీసువారువత్తురు)

పోలీ--శవమేదీ?

సదా-- అక్కడ నున్నది.

పోలీ-- హత్యచేసినవా రెవరు?

విన--నేను.

పోలీ--పట్టుడు.(జవానులు చుట్టవేయుదురు.)