పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
114

[అం4

భారత రమణి

విన్__నిజముగా హత్యచేసినది నేను.తెరవాటు కాండ్రనుండి సుశీలను తప్పించుటకై హత్య కావించవలసి వచ్చెను. దీనికై నస్కురిశిక్ష తప్పదు.

కేదా__ఉరి తప్పనిచో ఈహత్య చేసినది నేను. ఉరికి పోవుట నాకు పరిచితమే. మీకు చేతకాదు. కావున హత్య చేసినది నేను.

విన__నీమాటలు వింతగా నున్నవి. ఈమె ఈమె నింటికి చేర్పుము, కేదారా!

సుశీ__నేను వెళ్ళను.

విన__నిన్నుకూడ ఈహత్యలో చేర్తురు.

సుశీ__కానిమ్ము.

కేదా__అట్లు కాదు. నిన్నింట విడిచి నేనురికి పోయెదను. వినయా! హత్యచేసినది నేను సుమా! మరువ వలదు.

సుశీ__నారక్షకుని వీడి అడుగైన కదలను.

విన__చెరసాలకు పోవుదువా?

సుశీ__సందియ మేల?

కేదా__మీరుపోనేల! నేను సిద్దముగా నున్నాను.

విన__నామాట విని మీరింటికి పొండు.

సుశీ__నేను పోను (సదానందుడు వచ్చును) సదా__అమ్మా! సుశీలా! వినయునిగూర్చి నీకు బెంగవలదు, నీవింట్కిబొమ్ము; ధర్మమే జయము పొందెడుచో