పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

143

భారత రమణి

విన--(గాయముతగిలినచోటపట్టుకొని) సుశీలా, ఇంటికి పొమ్ము.

సుశీ-- వినయా! దెబ్బ ఎచట తగిలినదొ చూపుము (దగ్గర బోవును)

వినో--నాదెబ్బ నీకేమి? నీ వింటికి నడువుము.

సుశీ--ఒంటరిగా నిన్నువీడి ఇంటికి నేను పొవుదునా? స్త్రీ నైనను నాకు మానుషత్వము లేకపోలేదు- ఏదీ గాయము? (గుడ్డ చింఛి కట్టును)

విన--ఇక నీవింటికి పొమ్ము.

(కేదారుడు వచ్చును)

కేదా-- నీవేల పడియుంటివి? సుశీలా! ఇచటి కెట్లు వచ్చితివి?

విన--ఇచట నొక హత్యజరిగెను, పోలీసువారు వచ్చె దరు. ఈమె నింటికి చేర్పుము, కేదారా!

కేదా-- హత్య చేసిన దెవరు?

విన--నేను

సుశీ-- కాదు, నేను హత్య చేసితిని. ఇదుగో రివాల్వరు.

కేదా-- అసంభవము! హత్యచేసిన దెవరో నేనెరుగను, కాని మీలో నొకరు చేసిరనిన నేను నమ్మను.