పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
143

[అం 4

భారత రమణి

పా ట

శిల్కనా గున్నది. శిత్తరువు బొమ్మా
సక్కగా నుశాను. శానిగా శేస్తాను ।శిల్క।

మూడవ-- ఓ ర్నువ్వుండురా!
వొదిలిపట్టా నొరి దీన్ని
వొళ్ళు గుఱగు ఱ్లాడేని ।శిల్క।

నాలవ--
మొగము సూశి-మురిశి నాను
సొగసులాడి ముద్దుబెట్టు ।శిల్క।

నాయ--ఒరే. మీకు మతో యిందిరా! సొత్తు దోసుకోపోక కారుకూతలు కూస్తారేం! ఒక్క సెడ్డ మాటొస్తే, ముక్కలు ముక్కలు శేస్తాను.

సుశీ--అయ్యా! రక్షించు, రక్షించు.

అతనిప్రక్క చేరును

(వినయుడు పిస్తోలుతో వచ్చును)

విన-- ఓరీ దూర్తులారా, జాగ్రత్త?

నాయ--మొగాడ్రోయి-ఇఖ మనవంతా నొకటి, రండి- ఏంట్రా పేల్తావు బాపడా! (వినయుని మీది కురికి గాయము చేయ అతడు పిస్తోలు కాల్చును, వెంటనే నాయకుడు కూలును, మిగిలినవారు పారిపోవుదురు.) సాటి మొగాడ్తో పొరాను, వచ్చాను. నాకంతే సాలు.(మృతి)