పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

141

భారత రమణి

టేశా, దెబ్బతిన్నాది. మాటాడలేదు మంతీ లేదు. నల్లగా నాకేసి చూస్తానే దబ్బున పది గిలగిలకొట్టుకొని పానం వొదిలేశించి. తల్సుకుంటే యిప్పుడు నావొళ్ళు గరిపొడుస్తారి. అప్పటాల్నుండి నంటడం మానేశాను.

రెండ--ఔన్రా! అంతకు ముందు యీడి మనసు రాయే! ఎంత తెగవూ? ఎంత బలవూ? మనిషే మారిపోయాడురా, పెట్టెగిరి పోగల్దు. కాలు సాగనీండి.- (పొవును)

(దొంగలు సుశీలయు వత్తురు)

సుశీ--మీరెవరు?

నాయ--అత్తెలిశి నీ కేం లాభం?

సుశీ--దొంగలా?

నాయ--సక్కగా పొల్చావు.

సుశీ--నా సొత్తంతయు కొనుడు (తీయబోవును)

నాయ--నగలు మాకొద్దు. నగ దిచ్చీ!

సుశీ--ఇదుగో.(నోటుల నిచ్చును)

నాయ--ఇం కొదిలేండిరా.

మొద--ఇంకే వుందో?

సుశీ--దైవము తోడు. ఇంక లేదు. నన్ను పోనీయుడు.

రెండ--అబ్బా! వొదిలేడనే?