పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
140

[అం 4

భారత రమణి

సదా-- అయ్యా! స్టేషను వరకు నేను వచ్చి జామీనిచ్చెదను.

పోలీ-- మీరెవరు?

సదా--వీని తండ్రిని.

పోలీ--పాపము.. ఈతడు హత్య చేసెనె?

సదా--నేనెరుగుదు. జామీ నిచ్చెదను.

పోలీ--ఏపాటి ఈయగలవు?

సదా-- ఒక లక్షరూపాయీ లిచ్చెదను. మీయొద్ద నుండి వీని నిప్పుడు గొంపోవలెనన్న మీకు వేయిరూయీలు కూడ ఇవ్వనక్కరలేదు. అట్లైన "నేరముచేసినవాడు పరారి" అని మీరు వ్రాయుదురు, కాని అట్లు జరుగవలదు. ఈనేరము న్యాయము జరిగి, తీరవలయు. అందు నాకుమారున కురినిశ్చితమైనచొ నేను స్వయముగా వీని కంఠమున కురిపోసి ప్రాణముల తీసెదను.

పోలీ--అట్ల చుంటివేల? ఇతడు మీసుతుదో!

సదా-- మీకిది వింత గొల్పుచున్నదా? ఇతడు నా కేకపుత్రుడు. ఇట్టివారు నూర్గురుండి వారికందర కీరీతిని ఉరి తటస్థించెనా, వారికి వేరుమృత్యువును విధింపుమని విధాతను వేదుకొనను. ఓహో! నేదు నాబోటి ధన్యుడెవడు? ఇట్టి పుత్రుని కంటినని గర్వముతో వాడవాడల చాటుచు పొవుదును. వినయా! నిన్ను కన్న ఋణము తీర్చితిని. ఉత్స