పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

137

భారత రమణి

వినో-- ఎక్కడికి పోయెదవు?

సుశీ--వల్లకాటికి వినో-- అబ్బా! ఎంత మాటాడితివే! చెల్లలా, నాతో చెప్పిననేమికష్టము! నీకునేడు కోపంవచ్చినది. లేకున్న నాతొ నింత పరుషములు పల్కుదువా? ఆత్మహత్య కావించుకొనిన ఆమె నాకు మాత్రము తల్లి కాదా? కాని చెల్లెలా తండ్రి గారి మతి తల్లడిల్లినది. క్షమయే స్త్రీలకు పరమావధి- బరించియుండుటకే మనము పుట్టితిం. ఇది ఈశ్వరఇధానము కావున మనము దానిని మారుమటాడక మన్నింప వలయును.

సుశీ--మన్నింప వలసినదే, స్త్రీజాతిని అబలలచేసిన ఆ విధి తదనుకూలముగ పురుషుల మనసులయందు దయయు సానుబూతియు సృజించెను. పశువులకువలె కాలుసేతులు మాత్రమే కామ, మానవులకు వివేకము మానుషత్వమ్ను ప్రసాదించెను. పురుషుల మనికిని మన్నికకును మూలకారనము స్త్రీలే కదా! అట్టిస్త్రీలు అబలలైనంత మాత్రమున పురుషులు వారిన్ కేవల విలాససామగ్రిగ భావించి, అక్కద్ తీరుటకు మాత్ర ముపయోగించు కొనుచు, వారు జాత్యుద్దరణము నకు దేశాబివృద్ధికిని నేరుపురుగులని భావించుట న్యాయమా? ఇట్టి పురుషజాతి ఎన్నటికేని తలయెత్తుకొని తిరుగ గలదా? పురోభివృద్ది గాంచ గలదా?

వినో-- కాని--

సుశీ-- పలుమాట లేల? నాకై నీవు చింతింప నని