పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
136

[అం 4

భారత రమణి

అను నేను సాటిసేయను.

వినో--పాటించినను, పాటింప కున్నను, పెండ్లియాడి నను, ఆడకున్నను.... ఇంటికి నడువుము.

సుశీ--నేను రాను. అక్కా! నా స్వభావము నీకు చక్కగా తెలియును. ప్రతికర్యమును, నాకు నచ్చినట్లు నాబుద్దికి దోచినట్లు, నాప్రవృత్యనుసారము చేయుచుందును, కాని ఒకరి మాట వినను, నామేలు నే నెరుగుదు.

వినో--ఇంటికి రావా?

సుశీ--ఎన్నిసారులు చెప్పుచుందువు! నేను రాను. నాతల్లి కట చోట లేకుండిన నాకు మాత్ర ముండునా? నీవు పోయి హయిగా కడుపునిండ తినుచు కంటినిండ నిద్రించుచు జీనములను భరించి యుండుము. అది నా చేత కాదు. అట్టి బ్రదుకు నాకేహ్యము.

వినో-- ఇంతకన్న నెక్కువ నేనేమి చెప్పగలను?... ఒకవేళ వినయుడు బోధించిన విందువేమో?(వెడ వెడ నవ్వును) కాని అతడు నీయెదుట పడుటకు కూడ సమ్మతింపకనన్నిట విడిచి నదీకూలమునకు నడిచెను. నీ నోటివడిచేతనే అతని మనసు నొవ్వజెసితివి.

సుశీ-- ఔ నక్కా, తప్పంతయు నాదే, అట్లే చాటుచుండుము. వినో-- అయితే ఇంటికి రావా?

సుశీ--రాను.