పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
138

[అం 4

భారత రమణి

లేదు. హాయిగా యింటికి పొమ్ము నన్ను నేను పోషించుకొనగలను. రక్షించుకొన గలను. ఇటు చూడు, (రివాల్వరు చూప ఇనోదిని నివ్వెరపడును) ఇక పొమ్ము. తండ్రిగాగిని ధిక్కరించితి నని మీరు నాపై కినియకుడు. నాతప్పు సైరింపుడని నాన్నగారిని వేడుకొనుచున్నానని చెప్పుము. నా కాంగ్లభాష నేర్పి మిల్టన్, షెల్లీ, మిల్, కార్లైట్ మొదలగు మహాకవుల గ్రంధములను వారే పఠింపించినందుకు ఇంతకన్న నెక్కుడు ఫలము సమకూరునని తలుచుట భ్రమ అని యెంచుమనుము.

వినో-- నేను పోయివచ్చెదను. నీ చందము నాకు నచ్చలేదు. కాని ఏమి చేయుదును? నీకు శుభమగుగాక!... (ఫోవును)

సుశీ--ఇంటికే పోను. పురుషుల పెత్తనము నాకు పరమాసహ్యము. ఏమైన కానీ...(పోవును)

(దొంగలు వచ్చెదరు)

మొదటివాడు-- మరీ-అరుగుబా టెలాగా?

రెండవ వాడు--ఈపని మానుకొవాలి. అంతే

మూడవ వాడు-- మునుపు అయినా డంక్షామీద్దెబ్బ కొట్టి దోచుకొనే వోళ్ళు. అడ్డూ లేదు, గిడ్డూలేదు.

నాల్గవ వాడు-- ఇప్పు డెటుసూశినా పోలీసోళ్లే! ఆశ్చ కొపలు గూల-అడ్డనౌతారు. మనాటలు సాగలేదు.

నాయకుడు-- అందుకె. ఈపని మానేద్దాం రా.