పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 3]

138

భారత రమణి

సుశీ-- నా కిల్లు లేదు, వాకిలి లేదు. నిరాశ్రయను.

వినో--ఎక్కడికి పోవ నెంఛితివి?

సుశీ-- ఏమో?

వినో-- ఇమ మరలుము.

సుశీ--ఎక్కడికి?

వినో--మన ఇంటికి.

సుశీ-- అట నా కనువుపడదు.

వినో--ఏమీ? అతడు తండ్రి కాడా?

సుశీ--అతడు మన అమ్మను ఇంటినుండి తరిమెను, తల్లిలేని పుట్టిల్లు తలపనేల? నేను--అమె తనయునయ్యి ఆయింటికి పోవుదునా? ఇంతకును ఆయన నననేల? అనాదినుండియు మనకు పురుషులచే అవమానము ప్రబలుచునే యున్నది. తండ్రిగారిది తప్పు కాదు, ఇది లోకమర్యాద!

వినో--ఆ వేటి మాటలు! మన కన్న వస్త్రములను వారేకదా యిచ్చుచున్నారు.

సుశీ--అబ్బా! ఏమి వారి దయాహిల్లోలము! పట్టెడు కూడు పెట్టుచున్నారని ఇంత అహంకృతి యేల? పరుల పాదములపై బడి పిడికె డన్నమునకై బిచ్చకత్తెలవలె పెనగులాడుట మన కేమి గౌరవము? అది లజ్జావహము కాదా?

వినో-- నీమాట లెంత వింతగా నున్నవి? చాల్చాలు ఇక నింటికి పద-నిన్ను వెదకుటకు నలుదెసల మనుష్యులు వెళ్ళిరి. నేనుకూడ నిన్ను వెదకి వేసారి తుద కిట గాంచితితిని!