పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
132

[అం 4

భారత రమణి

కేదా--మీ ప్రభువుగారికి కారాగృహప్రవేశము తప్పదు. ముడిమాట చెప్పితిని. మీది సంగతులు మీకేల?

హరి--సాంతము చెప్పుము.

కేదా--ఇంకిట నుండను. ఉండినచో దాచలేను పెదవి దాటునేమో!... నాలుక చివర నున్నది...(పారిపోవును)

నవీ-- వీనికి పిచ్చి ఎత్తినదా ఏమి?

హరి-- లేదులేదు మతిచెడినట్టు లెదు.

వినో--జైలునుండి వచ్చెను కదా?

శంక-- అట్లైన పిచ్చియెత్తి యుండును.

నవీ--కాని ప్రభువు....

హరి--ప్రభువు లేదు గిభువు లేదు. ఆమాట నెత్తక నడువుము.

వినో--కిరీటపూజ కాకుండగనే!

శంక--ఆ సత్కారము సాగింఅకయే మనము పొవుట భావ్యము కాదు. గురుదక్షిణ ఈయవలదా?

హరి--కంట పడినచో కానుక లిత్తుము వెదకుదము రండు... (ఫోవును)

              -----

---:మూడవరంగము:--

(పడవల రేవులో సుశీలా వినోదినులు)

వినో--ఇల్లు విడిచి ఇక్కడి కేల వచ్చితివి?