పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 2]

131

భారత రమణి

శంక-- ఐననేమి? ప్రమాదమా?

కేదా-- సందేహమా? అయ్యగరి పని అయినది.... తుదకు యజ్నేశ్వరుడు! ఓహో! చెప్పివేసితినే!... ఆ!.. మరి చెప్పను. ఇక చెప్పను.

శంక--ఎందుచేత?

కేదా--ఆమాట దాచుటకూడ అసాధ్యముగా నున్నదే!

వినో-- అట్లైన చెప్పకూడదా?

కేదా-- ఓహో! ఏమి చిత్ర మెమి చిత్రము !అహ్హహ్హాహ్హ.. యజ్నేశ్వరుడు! ఓహో! ఏమి వింత!... అలమరలో.. ఓహో బాలో! ఏమి మజా!

నవీ-- ఏమిటది? చంపక చెప్పుము.

కేదా-- అయ్యొ బాబో! చెప్పివేసితిని. ఇంకేమున్నది? దాచలేక పోయితిని. కడుపు పగిలిపొవుచున్నది. ఏమి చిత్రము!

అందరు-- చెప్పు! చెప్పు! చిరమేదో.

కేదా-- అహ్హహ్హహ్హా! గడ్దిచిక్కే వచ్చినది. సంగతేమిటో తెలియునా?... సాక్ష్యము సిద్ధముగా నున్నది... అలమరలో... హా:హా: .. ఇక నా తరం కాదు!

హరి-- సంగ తేమో చెప్పనే లేదే?

కేదా--చెప్పుదును. గ్రంధము చాలయున్నది. చెప్పవద్దన్నారు.

శంక--దానికేమి లే.