పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
130-

[అం 4

భారత రమణి

కేదా-- ఎవడురా వాడు? ఓరీకంచరగాడిదే! నరాధమా! పశువా!...ఆ! అదేమి? కేదారా! ఇక తిట్టనంటివే! పరనింద పాప హేతువు... మరియాదగా మాట లాడుము... అన్నలారా! శ్రీయుత ఉపేదమహాశయులు గారికి కారాగృహప్రవేశ మహోత్సవము కానున్నది.

నవీ--కారాగృహమే!

కేదా--ఆహా- కరాగృహమే. జెయిలె. చెరసాలయే. బందిఖానా. అచ్చటికి పోయిఅవతారపురుషులు కావున దానిని పవిత్రము చేయవలదా? అహ్హాహ్హ హ్హా అన్ని ముచ్చటలును తీరవలయునా లేదా?

నవీ-- ఏమంటివి? ఏల?

కేదా--ఇక చెప్పను, కాని కారాగృహప్రవేశ మహోత్సవమునకు ముందు రెండుమూ డర్ధచంద్రప్రయోగములను అలవడజేయ నైతిని. ఈకొతుకు నామానవమును జరుగనున్నది (నవ్వును)

నవీ-- ఏమి టాచిత్రము?

కేదా-- చెప్పనా!... చెప్పవలదని నిషేదీంచెనే?

వినో-- ఎవరు?

కేదా-- చెప్పుదునా!... చెప్పను... ఇదిగో వినుడు... ప్రమాణము చేత జిక్కినది... ఇంకొక అక్షరము చెప్పినచో అంతయు బట్టబయలగును.