పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
రం 2]

129

భారత రమణి

వినో--ఏమి కేదారా, ఎందు కా నవ్వు!

కేదా-- నోరు మూసుకో! నన్ను నవ్వనీ.

శంక--సంగ తేమో చెప్పుము.

కేదా-- ఓరీ! నన్నడ్డకు, సర్కారువరి రోడ్డిది. నాచిత్తము నేను నవ్వు కొనెదను. నీవెవ్వడవు ననండుగుటకు? హిహ్హిహ్హిహ్హి! అహ్హహ్హహా!

నవీ-- సరే కాని, కేదారా, ఇది....

కేదా-- నొరు మూసుకొనుము. గాడిదెగుడ్డు లాగు, తొత్తుకొడకా! పింజారీ! మీ దారిని మీరు పోక నాచేత తిట్లేల తిందురు? నేనెవ్వరిని తిట్టకూడదని తీర్మానము చేసుకొంటిని, కాని మీతుంటరిమూకను చూచినతొడనే నా నోరు ఊరకుండదు.

నవీ--మామతము మారినది మాకు బుద్ది వచ్చినది.

కెదా--నిజమే? మీ మాట కేమిలే- మీది కుక్క బుద్ధి! అతని బుద్ధి మారునా?... ఒరీ, నన్ను రేపకుడు. అహ్హహ్హా ఇప్పుడు జెయిలులోనికి పంపెదను. పెద్దన్నా! జైలునకు నడువుము. తా ధీం తానా కిటకిటతక తాధీం తానా (ఆడును)

వినో--అదేమి? కేదారా! ఆదుచుంటివి!

కేదా--కిటకిటక తా ధేం తానా... ప్రభువు గారికి కారాగృహ ప్రవేశము.

శంక-- కారా గృహమే!