పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
28

[అం 4

భారత రమణి

--రెండవ రంగము--

--(నడుత్రొవలొ భక్తగణము)-- 

హరి-- ఓరీ, ప్రభువుగారి భోగట్టా తెలియనే లేదు.

వినో--ఔను, ఏదో విశేష ముండవలయు

శంక--ప్రభువుగారి పంధ మరిన ట్లున్నది.

నవీ--మహాప్రబూ! ముమ్మువీడి ఎట బోయితిరి!

హరి--అయ్యో! వీడు కంట నీరుబెట్టు చున్నాడు!

నవీ--గురువుగారు నాకేదైన పని నిప్పిందెనని పల్కిరి. అయ్యో! గురువరా, ఇప్పు డెందుంటిరి!

హరి--అయ్యో! పాపము ఎంత దురదృష్టవంతుడవు.

వినో--బెంగ పెట్టుకొనకు, నవీనా.

నవీ--ఊరంతయు వెదకి ప్రభువుగారి పత్తా గంటినా

శంక--ఏమి చేయుదువు?

నవీ-- నాతృప్తితీర రెండిచ్చుకొందును/.

హరి-- ఏమిరా! అదేమి?

నవీ--ఎంత చాకిరీ చేసినాను! అంతయు నిష్పలము.

వినో--విసిగి వేసారి నిరాశ చెందకుము భక్తుల వాంచితముల ప్రభువువారు నెరవేర్చకపోరు.

శంక--వారిలీలలు అగమ్యగోచరములు!

(నవ్వుచు కేదారుడు వచ్చును

కేదా-- అహ్హహ్హహ్హహ్హ!