పుట:Bharata RamMani, Sripada Kameshwara Rao.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
134

[అం 4

భారత రమణి

సుశీ--ఇంత శ్రమపడి యేల వచ్చితివి?

వినో-- నీకు బుద్ది చెప్పుటకు నీ విట నుందువని వినయుడు చెప్పగా వాని తోదున వచ్చితిని. నేను నీ సోదరిని. పెద్దదానను, కావున నామాట వినుము. ఇంటికి నడువుము. ఆడదాని కింత యుద్దత శోభస్కరము కాదు. మనము దుర్బలులము, అజ్ఞానులము.

సుశీ--అట్లని పురుషులు మనల కాలితో తన్నవలయునా? వారి కంత పొగరా! ఆడది మానవ జాతిలోనిది కాదా?... రెండు పూటలు రెండు పిడికిళ్ళ కూటికై మనము వారిని యాచింప నక్కరలేదు. ఈపాటి గడించుకొనగలము.

వినో--చిన్నప్పుడు నీతీ రెట్లుండలేదు. తండ్రి యన్న ఎట్టి వాడని ఎంచితివి? అతడు దైవసమానుడు, అనితర ప్రీతి మాసన్నే ప్రియంతే సర్వదేవతా," అని శాస్త్రములు ఘోషించుదున్నవి.

సుశీ--శాస్త్రవచనములను నేను మన్నింపను. ఈవిషయము వేయిసారులు చెప్పియుంటిని...తండ్రిగారి యెడ నాకు భక్తి లేకపో లేదు. అది అందరికిని స్వాభవకమే. కాని అతడునన్ను కాలితోతన్ని, మా అమ్మను ఇంటనుండి తరిమిచంపిన నాకాత్మగౌరవ ముండగా! నేను మానవ జాతికి చెందనా?

వినో--ఇదంతయు పాశ్చాత్య విద్యా ప్రభావము