Jump to content

పుట:Bhagira Loya.djvu/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'


10

మీనాక్షికి కామేశ్వర్రా వంటే వెఱ్ఱి స్నేహభావం మొదటినుంచీ ఉంది. కాని స్త్రీపురుషసంబంధ మగు ప్రేమ భావాలన్నీ ఆమెకు కల్గలేదు. స్త్రీపురుషులకుండే ప్రణయ భావంగాని, మోహభావంకాని ఈలా వుంటుందని ఆమెకు తెలవదు. ఆమె చూపించే హావభావ విలాసాలు ఆమె హృదయంలో తాండవము చేస్తూ ఉన్న శైశవ, బాల్యదశలకు సంబంధించినవే. రూపంలో మూర్తీభవిస్తూ ఉన్నప్పటికీ, ఆ బాలికలో స్త్రీత్వము ఇంకా మనఃపధాలలో ఆవిర్భవించ నన్నా లేదు. కామేశ్వర్రావు వచ్చి చేసిన ఈ అద్భుత మంతాచూసి, మీనాక్షి విస్తుపోయి వెఱ్ఱి ఆనందంలో మునిగిపోయింది. కామేశ్వర్రావును కౌగలించుకొన్నది. "నాయుడుగారూ, మీరు గొప్ప మాంత్రికులా ఏమిటి" అన్నది. అతనికి అన్ని చాకిరీలూ చేసేది. తలదువ్వేది, నీళ్లు పోసుకునేటప్పుడు సబ్బుపెట్టి ఒళ్లు రుద్దేది తమలపాకులకు సున్నం రాసి యిచ్చేది.

భార్య చేసే చాకిరీలాంటి యీ పరిచర్యచూసి కామేశ్వర్రావు ఈ బొమ్మలరాణి తన్ను సంపూర్ణముగా ప్రేమిస్తున్నదని భావించుకున్నాడు. ఆమె తనను ముట్టుకున్నప్పుడల్లా అతని వొళ్ళు ఝల్లుమనేది. ఆమె తన దగ్గిరగా వచ్చినప్పుడల్లా తన ఒళ్ళోకి తీసుకునేవాడు. ఒకనాడు తన దృఢ బాహువుల్లో ఆ బాలికను అదిమిపట్టి, నవనవలాడు ఆమె నుని

84