పుట:Bhagira Loya.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి

వెచ్చని దేహాన్ని తన దేహానికి హత్తుకొని, బుగ్గలపై, కంఠంపై, కన్నులపై, తలపై ముద్దులవర్షం కురిపించి ఆమె పెదవులను చుంబించనారంభించాడు. మీనాక్షి హృదయం జల్లుమన్నది. ఒళ్లు ఉప్పొంగిపోయింది. ఆమెలోని బాలికాత్వము పువ్వు రేకులలా రాలిపోయింది. ఆ బాలిక ఆతని కౌగిలింత లోనే జవ్వనియగు స్త్రీ అయినది. కాని కామేశ్వర్రావుపై ఇంకనూ ప్రణయభావ మేమాత్రమూ కలుగలేదు. స్త్రీత్వమంకురించిన నునుక్రొత్తలో పైకుబికిన మోహము ఆమెను వివశ నొనరించడం వల్ల ఆమె ఆతని కౌగిలింతలో హత్తుకుపోయింది.

ఆ మహాతరంగం దాటిపోయింది. మీనాక్షికి మెలకువ వచ్చింది. ఆమె ఆతని బాహువుల్లోంచి విడిపించుకొని ఆ గదిలోంచి బయటపడి తన గదిలో మంచంమీదపడి దొర్లుతూ యెందుకో తనకే తెలియకుండా వెక్కివెక్కి ఏడవడం ప్రారంభించింది. ఆ గంభీర విషాదానికి కన్నీళ్ళన్నా లేవు. ఆమె రావి ఆకులా గజగజ వణికిపోయింది.

కామేశ్వర్రావు మీనాక్షి తనను ప్రేమిస్తోందని గాఢ నిశ్చయం చేసుకున్నాడు. ఇంక తన కర్తవ్యం ఏమిటి? తనకు వివాహం కాలేదు. మీనాక్షితో వివాహం పనికిరాదా. వివాహం లేకపోతే మీనాక్షితో పులకరించే స్నేహమెట్లా? ఆలాంటి దివ్యమైత్రి తన అంతరాత్మకు వ్యతిరేకమా? అది తప్పా ? స్త్రీపురుష ప్రణయసంబంధానికి వివాహము ముఖ్యమా ? పురోహితుల చేతనూ, దొంగ ఆచారాలచేతనూ

85