బొమ్మలరాణి
ట్లోకే మహారాణి వైనావనా నీ వుద్దేశం, ఛండాలపు రండా లే, వచ్చిపాడు. చావగొట్టివేస్తాను," అని ఉరిమాడు.
తాతగారి కోపం చూసి దడదడలాడుతూ, భయంతో తెర దగ్గరకు వచ్చి, మద్దెలకు నమస్కరించి పాటయెత్తింది. శ్రుతి కలవదు. వెనకటి వరస రాదు. గొంతుక స్థాయికి పెరగదు. అందరూ అందిచ్చినారు. నాలుగు గొంతుకలు కలిసినవి. కాని మీనాక్షి గొంతుక అందుకోదే! పదిహేను నిమిషాలు తంటాలు పడ్డారు. మీనాక్షి గొంతుక అపశ్రుతి తప్పుకోదు, సామ్యం యేర్పడదు. తెర అవతల ప్రజల్లో గడబిడలు బయల్దేరాయి "మీనాక్షిని పాడమనండీ" "మీనాక్షిని పాడమనండీ" అని కేకలు. మీనాక్షి పాడలేదు. అందరికీ వెఱ్ఱెత్తిపోయింది. వీరయ్య అన్యాయంచేశాడు అంటూ ఉప్పెనకెరటం విరుచుకుపడ్డట్టు జనం అంతా పందిరి మీదకు విరుచుకు పడడం మొదలెట్టారు. వీరయ్య గజగజలాడిపోయినాడు. మీనాక్షి నిద్రలేచి వచ్చినట్లు లేచి వెనకటి గొంతుక తెచ్చుకొని వెనకటిలా పాడదామని యెంతైనా ప్రయత్నం చేసింది. కాని లాభం లేకపోయింది. ఆమెకు యేడుపు వచ్చింది. వెక్కి వెక్కి యేడ్చింది.
జనం వచ్చి తెరమీద పడి తెర పీకేసారు. విఠలుడు ఈ గడబిడంతా చూసి ఆడవాళ్ళని చేతికి దొరికినన్ని బొమ్మలు పట్టుకొని పారిపొమ్మన్నాడు. మిగిలిన బొమ్మలు చిన్న వీరయ్య చేతి కిచ్చి పరిగెత్తమన్నాడు. తిత్తీ, మద్దెలా యిచ్చి తండ్రిని పంపివేశాడు. ఇంతలో నగరాలలో వీరయ్య
77