పుట:Bhagira Loya.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

అంటే మంచభిప్రాయం కల్గిన ఒక వస్తాదుల జట్టు లాటీ కఱ్ఱలతో రంగంలో ప్రవేశించి, దెబ్బలాడి, ప్రజలు పాకకు నిప్పు అంటించకుండా చూశారు. జనం అంతా వెళ్ళిపోయిన తరువాత విఠలుడు తక్కిన వన్నీ సర్దుకొని తమ గుడిశెల కాడికి చేరుకున్నాడు.

జట్టును లేవదీసుకొని బందరు పారిపోయాడు వీరయ్య.

8

కామేశ్వర్రావుకు మీనాక్షి వెళ్ళినప్పటినుంచీ మతి లేదు. అతని ప్రేమకు మీనాక్షి నిదానమై పోయింది. యౌవనము వచ్చిన యిన్నాళ్ళకు ప్రేమంటే యేమిటో తెలుసుకున్నాడు. మీనాక్షితో రెండేళ్లు స్నేహం చేసి, మీనాక్షీ, తానూ సహాధ్యాయులై, మీనాక్షికి తాను గురువై, మెలిగినతరువాత తీరా మీనాక్షి వెళ్ళిపోయిన వెనుక తనని మూలమంతా కదిల్చి వేసిన ప్రేమతో ఆమెను ప్రేమిస్తున్నానని గ్రహించాడు. ఆమె మాటలు, దివ్యమైన ఆమె గాంధర్వమూ, విచిత్రసుందరమైన ఆమెమూర్తీ ఆతని బ్రతుకుచుట్టూ మహాప్రపంచములైనవి. మీనాక్షి నామము జపమైనది. "దేవీ మీనాక్షీ" అని ఆతని హృదయకుహరాలలో పల్లవి సర్వకాలమూ నినదిస్తూనేవున్నది.

భీమవరంలో ఒక్క నిముషం వుండలేకపోయినాడు. రెక్కలు కట్టుకొని బెజవాడ వచ్చిపడ్డాడు. అక్కడ వాకబు

78