పుట:Bhagira Loya.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

"ఆహా! ఇక ఏలాగయ్యా? సంవత్సరో, వత్సరో, అబ్దో, హాయనో, శరత్సమాః, ఇత్యమరః, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసుంటుంది అని ఆలోచించుకుంటూ -"

"ఆహా!"

ఈ రకంగా కథసాగించారు. ఇంతలో ద్రౌపది పాట పాడవలసిన సమయం వచ్చింది. జట్టు అందరూ మీనాక్షి వైపు చూశారు. ఆ బాలిక మోకాళ్లు ముడుచుకొని కూర్చొని, మోము మోకాళ్ళలో ఉంచుకొని, చేతులు మోకాళ్ళకు చుట్టుకొని, కళ్ళలోంచి ఆశ్రుబిందువులు రాలుస్తూ ఈ లోకంలోనే లేదు. తల్లివెళ్ళి "మీనీ, మీనీ పాటపాడ్డానికి రావే, నీ దుంపతెగ, మొద్దులా కూర్చున్నా వేమే? లే, వచ్చి పాట పాడు," అని కేకలువేసింది. చిచ్చర పిడుగులా లేచింది మీనాక్షి.

"నేను పాడ దలుచుకోలేదు. మీ సరుకులు మోసే గాడిదలు లా మీరు కూడా గాడిదలు. తోలుబొమ్మలాటా? ఇది దెయ్యాలాటా? అని కాళ్ళు గబ గబ భూమికేసి తన్నింది. తల్లి బ్రతిమాలడం, తండ్రి కేకలు వేయడం, అంతా తాతగారు చూస్తున్నాడు. అందాకా ద్రౌపదిభాగం చిన్నవీరయ్యకు క్రొత్తగావచ్చిన భార్య చదువుతూ వున్నది. వీరయ్యకు కోపమువచ్చింది. ప్రళయకాలరుద్రమూర్తిలా అయిపోయాడు. రెక్కలుపట్టి నుంచోపెట్టాడు. "నీకు సంగీతం చెప్పించినందుకా ఇంత పొగరమోతుతనం? ఇంత

76