పుట:Bhagira Loya.djvu/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బొమ్మలరాణి


7

అపుడు జట్టంతా బెజవాడలో ఉంది. వీరయ్య, విఠలుడు, చిన్నవీరయ్య మీనాక్షిని ఆనమాలుకట్ట లేకపోయారు. ఆ బాలిక పెంటకుప్పలోనుంచి బయలుదేరిన చేమంతిచెట్టు లా ఉన్నది.

మీనాక్షి తన వాళ్ళను యెగాదిగా చూచుకొన్నది. వందసంవత్సరాల క్రితం ఉతికిన బట్టలు కట్టుకుంటూ, వారానికి ఓమాటైనా స్నానం చేయకుండా తిరుగుతూ, నానావిధ నీచపదార్థాలు తింటూ, ఊరుబైట వేసుకున్న గూడుగుడిశల్లో, సామాను మోసుకునేందుకు ఉపయోగించే గాడిదల తోటి, కాపలా కాసుకునేందుకు ఉపయోగించే పులుల్లాంటి కుక్కలతోటి సావాసంచేస్తూ, నూనిరాసుకొని దువ్వుకో నందున పేలుపట్టియున్న తలలతో, వెఱ్ఱిమొఱ్ఱి రాళ్ళపూసల పేర్ల నగలు పెట్టుకొన్న మెళ్ళతో, వెండి మురుగులు అలంకరించిన చేతులతో, బంగారు గుల్ల దండకడియాలు దాల్చిన బాహులతో, వెండిబిళ్ళల మొలనూళ్లతో, వెండి వడ్డాణాళ్లతో, పొగాకు, తమలపాకూ గారలు కట్టించిన నోళ్ళతో తన చుట్టూ ఉన్న తన చుట్టాలను చూసేటప్పటికి మీనాక్షి హృదయం క్రుంగిపోయింది. సీతారామయ్యగారి ఇల్లు, ఆ రోజుల తన జీవితము మీనాక్షికి కళ్ల యెదుట అస్తమానమూ ప్రత్యక్ష మౌతూనే ఉన్నది.

73