Jump to content

పుట:Bhagira Loya.djvu/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

ఆ బాలుడు మా వూరు పెద్దమాలపల్లిలో వుండే అబ్బాయి. వాళ్ళ అయ్య మా వూళ్ళో వున్న కరణంగారి పాలేరు.

మా అన్నయ్య వాడిని చావకొడుతూవుంటే వాడు పెట్టిన గోల రాతినైనా కరిగిస్తుంది. నేను వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ అబ్బాయి సొమ్మసిల్లి మూర్చపోయాడు. నేను ముందుకు పరుగెత్తి వాడిమీద నా చెంబులోవున్న నీళ్లు చల్లాను. వాడికి మెలకువ వచ్చి లేచి గుండె కరిగి పోయేటట్లు యేడుస్తూ తూలుతూ నడిచిపోయాడు.

నాకు నరసన్న ఏడుపు వినిపిస్తున్నది. స్వామికి అర్చన చేయించే పూజారి మంత్రాలు వాడి ఏడుపులా వున్నవి. గుడిలో మ్రోగించే గంటలు వాడు యెక్కియెక్కి రోదించినట్లే వున్నవి. నేను అప్పుడు చిన్నబిడ్డనే అయినా నాకు నరసన్నను మా అన్నయ్య కొట్టడం నన్నే కొట్టినట్లయింది. నన్నుకూడా మా అన్నయ్య కొడ్తాడేమో అనిపించింది. నేనూ వెక్కి వెక్కి ఏడ్చాను. నాకు ఎనిమిది సంవత్సరాలు.

'ఒసే రవణా ! ఎందుకే యింకా ఏడుస్తున్నావు?' అని మా అమ్మ కొంచెం ఘాటుగా అడిగింది.

'దానిని రెండు వేస్తే వూరుకుంటుంది' అని మా అన్నయ్య. ఎంత కోపం? మా అన్నయ్యకు నేను వూరికే భయపడ్డానా? వచ్చిన వేలకొలది జనంలో తొక్కిసలాడుతూ బయటకు వచ్చాం.

42