నరసన్న పాపాయి
రుద్రేశ్వరం గుడి యెదుట శివరాత్రి ఉత్సవంలో, గుడి లోకి రాబోయాడని మా అన్నయ్య ఆతన్ని చావ గొట్టాడు. మా అన్నయ్య ఆతన్ని చావగొట్టాడు ! ! మా అన్నయ్య ఆతన్ని చావగొట్టాడు ! ! !
నిజమే. ఆ బాలుడు హరిజనుడే ! అంత మాత్రాన మా అన్నయ్య వాడిని చావగొట్టడమే! ఆ కుఱ్ఱవాడు చేసిన తప్పు? శివరాత్రినాడు రుద్రేశ్వరస్వామి గుడి లోకి మా అందరి తోటీ రావాలని ప్రయత్నించాడు.
మేము కోనేటిలో స్నానాలు చేసి, పట్టు బట్టలు కట్టుకొని, పళ్ళూ కొబ్బరికాయలూ పువ్వులూ ఆరతికర్పూరం ఊదువత్తులు మొదలయినవి పట్టుకు బయలుదేతాం. మా వూరుకు రుద్రేశ్వరం ఎనిమిదిమైళ్లు వుంటుంది. రాత్రి బళ్లు కట్టుకుబయలుదేరాం. తెల్ల వారగట్లకు రుద్రేశ్వరంవచ్చాం. మా రెండెడ్ల బండే మాకు డేరా అయింది. దాని చుట్టూ తెరలు కట్టుకున్నాం. చాపలు కట్టాం. వంటలకు అన్ని సరంజాములు మా అమ్మచేసింది. ఆ తర్వాతనే తెలతెల్లవారే సరికి కోనేరులో దిగాం.
41