పుట:Bhagira Loya.djvu/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'


రాత్రి నిశ్వనాలు మాటుమణిగే కోకిల కంఠంలో, చెట్ల జేరే కొంగల అరుపుల్లో, జీబురాయల తాళగతులలో, ఊరిబయట నక్కల అరుపుల్లో, కుక్కల మొరుగుల్లో నిశ్శబ్దం ఆవరిస్తూవుంది.

సప్తమేఘాలు దిగివచ్చినట్లు భోరున కుంభవృష్టి కురుస్తూవుంది. దూరాన యాదగిరి కొండపైన లక్ష్మీ నరసింహస్వామి "ఓయి తెలుగు వీరుడా, బహుపరాక్" అని సింహగర్జన చేస్తున్నాడు.


40