'బాపిరాజు'
తమ్ముడు ఆ గ్రామాలన్నిటికీ మెరుము వెలుగుల దీపాలు ఉరుమునడకల శక్తులూ ప్రసాదించే యింజనీరై కనపడ్డాడు.
ఆతని తెలుగునాడు ప్రసరించి ప్రసరించి అటు తూర్పుతీరం చేరింది. ఇటు కన్నడిగ చెల్లెలిని కౌగలించింది. ఆ వైపు మహారాష్ట్రంతో నెయ్యమాడింది. ఈ వైపు అరవ మరదలితో సరసాలాడింది. గోదావరీ జలాలు - కృష్ణానదీ వళులలో సుళ్లుతిరిగి తుంగభద్ర కాలవలలో ప్రవహించాయి.
యాదగిరిరెడ్డి యింటికి చేరుకున్నాడు. అతని భార్య కంచుమెరుగు నవయౌవన సౌందర్యవతి. కోలమోమున మోదుగులు ప్రసరించిన బాలిక. కొండ తంగేటిమొగ్గ ముక్కు కలదై, కలిగట్టు చెట్టుపూవు గులాబిరంగు పెదవులు కలదై యెదురువచ్చి నాగలి దింపి వేన్నీళ్లు పోసుకోవడానికి రమ్మని నవ్వుతూ ఆహ్వానించింది. ఆమె తొడిగిన గద్వాల అంచుల రెవిక, ఆలేరు కెంపురంగుల చీర ఆమె సౌష్టవాంగపూరిత సౌందర్యానికి జోహారులన్నాయి. ఆమె మాట కూకురు గుడ్డంగిపిట్ట గొంతులోని తీపులు కలది.
నీళ్లు పోసుకుని వచ్చిన భర్తకు బతుకమ్మ జొన్నారొట్టి అన్నం వడ్డించి భోజనం పెట్టింది. బతుకమ్మ అచ్చంగా పొలం పడుచు. అన్నం వడ్డించే తన భార్య సొగసు చూస్తున్న యాదగిరిరెడ్డి మనసులో ఏవో మెరుములు మెరిసినవి. బతుకమ్మ తెలుగునాటి బంగారుదేవత. బతుకమ్మ పండగ కాబోలు ననుకున్నాడు యాదగిరిరెడ్డి. తెలంగాణపు రైతును
38