పుట:Bhagira Loya.djvu/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగేటిచాలు

"రామపాదం కొలుచుకొంటూ
సాగరమే వెలిసే నంటా
కొండా గుట్టా అడవీగట్రా
పండి పోసే బంగారుభూమంటా
నేల నాదీ, గాలి నాదీ
చాలు నడచిన వాలు నాదీ
కాలమే ఇకముందు
నాదే నోయ్!
అడవి నాదీ పుడమి నాదీ
కడిమి పూలా పడుచు నాదీ
విడని ధైర్యం విజయం నాదే నోయ్"

అప్రయత్నంగా కాళ్లు నడుస్తాయి. అడ్డాలు తీరి నడక సాగిస్తున్నాడు. అరమూతలు పడిన అతని చూపుల్లో తెలంగాణ మంతా భరతదేశాన్నే ఉద్ధరించే పాడిపంటల దేశమై, మెరుముశక్తితో పరువులెత్తే పరిశ్రమల ఆశ్రమాలతోనిండి ఎదుట ప్రత్యక్షమైంది. ఆత డనుకొన్నాడుః ఈ నేలంతా ఒకనాడు అడవులతో నిండి ఋష్యాశ్రమాలతో విలసిల్లేదట. ఈ నాడు పోడిమి తేలే ప్రజలతో ఈ పరిశ్రమాగార ఆశ్రమాలతో నిండి వుండదా? యాదగిరిరెడ్డి చదువుకున్నాడు. అతని చేతిలో నాగలి మేడితోక మాయమై ఆ యింజను నాగలి నడిపే మరచక్రమై నిలిచింది, పది ఎకరాలు సాగు సాగిన ఫలసాయం పదివేల ఎకరాలు ఫలించిన పంటై ప్రత్యక్షమైంది. అతని ఆ స్వప్నలోకంలో ఆతని

37