పుట:Bhagira Loya.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

పార్జించుకున్న వాడవు. పెనుగొండ కొండరాయల నాటి రెడ్ల ప్రతాపము పుణికి పుచ్చుకున్నావు. తెలుగునాటి మోటాడ రెడ్డి పోటుతనంతో శక్తివంతుడవు. నువ్వు భూమంచిరెడ్డివి, నువ్వు తెలగా వీరుడవు, నువ్వు వెలమ నాయకుడవు. నువ్వు చెన్నప్పరెడ్డివి, బంగారపు కడ్డివి.

ఆ మేఘంలోంచి ప్రత్యక్షమయాడు యాదగిరిరెడ్డి. ఆ భూమి మీద నిల్చినాడు. ఆతని ఎడమచేత మేడితోక, కుడిచేత ఆ తెల్లటి గిత్తలను తోలే ములుగోరు కర్ర. నాగేటిచాలు సాగిపోతూవుంది. ఆతని కంఠంలోంచి మధురశ్రీలు ఆకాశం నిర్మలాలు, అడవి మల్లెల పరిమళాలు పొదివిపుచ్చుకున్న జీవజాను తెలుగుపాట వెడలి నేలా, ఆ దిశలూ, ఆ ఆకాశం నిండిపోతున్నవి.

సాగించు నాగలి
సాగించు రెడ్డి
నేలంత ప్రవహించు
చాలుతో దుక్కితో

అని పాడుకుంటున్నాడు.

4

యాదగిరిరెడ్డి శాతవాహనుల కాలం నుంచి యీ నాటి వరకు నాగలి దున్నుతూనే వున్నాడు. పరభూములను మంత్రించి బంగారు పండు పంటభూములను చేసినాడు. అవి

34