నాగేటిచాలు
నీలి కలువలు ఆతని కళ్లు. ఆ కళ్ళల్లో కాంతులు యెల్లలు యెరుంగని దూరాలకు ప్రసరించిపోయే శక్తివంతాలైనవి. ఆ కళ్ళ కొలుకుల్లో అననుభూతమైన ఆశయాలు మిలమిలలాడుతున్నవి. తెలంగాణపు భూమివంపులా అతని నాసిక వక్రతతో ప్రవహించి పైకుబికి వంపు తిరిగి అతని సోగ మీసాలల్లో లయమైపోయింది. ఒకనా డాతని చేతిలో ఆయుధమైన విల్లువంటి ఆతని పెదవులు ఆంధ్ర దేశంలోని ఉదయారుణ రాగాలతో తాంబూలం సేవించుకున్నవి.
తెలుగు నేలల పండిన మామిడికాయ, ఆంధ్ర భూముల వెలసిన కోహినూరు వజ్రం ఆతని చుబుకము, తెలుగు సముద్రపు కెరటాలు పళ్ళెరాన తీసుకునివచ్చి సమర్పించిన శంఖమే ఆతని కంఠం. ఆతని బాహువులు కృష్ణా, గోదావరీ నదులు. అతని అంసలు మహేంద్ర నల్లమల పర్వతాలు. విశాలాంధ్రభూమి ఆతని ఛాతి.
నెత్తిని కోరతలపాగా, మొలను పైకెగదోసి కట్టిన పంచకట్టు, ఆ యువకుడు యాదగిరి రెడ్డి.
3
ఆ వీరుని ఉత్సాహము వరహగిరి నుంచి యాదగిరి చుట్టి కదిరివరకు ప్రత్యక్షమై వేంచేసిన నరసింహ దేవర హృదయం.
ఓ యాదగిరిరెడ్డీ! నువ్వు కమ్మ నాటి రెడ్ల కళా కౌశల్యము కలవాడవు. పాకనాటి రెడ్ల ప్రభావము సము
33