పుట:Bhagira Loya.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

2

ఆ భూమి సౌరభావృతమైపోయింది. జల ప్రవాహాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహించివచ్చాయి. చిన్నవీ, పెద్దవీ, సెలఏళ్లు, ఏళ్లుపతనాలు, సుడిగుండాలు, ఆటలు, పాటలు, ఫేరణీ నృత్యాలు, వృత్తాత్మికా చంక్రమణాలు, ఆ నేల ఉప్పొంగిపోయింది. భూమికి దిగివచ్చిన ఆ నీలజీమూతంలో లయమైపోయింది. మబ్బులో రంగరింపై కిందికి దిగివచ్చిన ఆకాశంలో కరిగిపోయింది. నేలా నీలిమబ్బుల ఆకాశమూ ఒక్కటైపోయాయి. ఒక్కసారిగా భూనభోంతరాళాలు పగిలేటట్లు మేఘ గర్జనములు నిండిపోయాయి. లోకమే మండిపోయినట్లు కోటి మెరుపులు తళతళలాడిపోయాయి. మబ్బులు మాయమయ్యాయి. ఆకాశం పైకిపోయింది. ఆ భూమిపైన ఒక ఆంధ్ర మానవుడు బలిసి, కండలు తిరిగి పోతరించి, హిమాలయ శిఖరంలా ధవళాచ్ఛమై వెలిగి పోతున్న రెండు గిత్తలకు నాగలి కట్టి ఆ భూమి దున్నుతూ వున్నాడు. ఆ మానవుని మోము ఆకాశంలా స్వచ్ఛమైవుంది. ఆ ఆంధ్రుని వదనము ఆంధ్రభూమిలా గంభీరరేఖా విలసితమై వున్నది. అతని విశాల ఫాలంలో వరదగోదావరి నున్నని ప్రవాహం ప్రత్యక్షమైంది. ఆతని కళ్లు సోగకళ్ళు. చిన్నచిన్న కోనేరులలో హృదయమార వికసించి పరిమళాలు వెదజల్లే

32