పుట:Bhagira Loya.djvu/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోగీరలోయ

“ప్రభూ! ఆ దివ్యవరము ప్రసాదింపబడినప్పుడు ఏమి తెలుసుకోవాలి?”

“వెఱ్ఱిదానా! చటుక్కున ‘నన్ను ప్రేమించడంలేదా’ అని ప్రశ్న వేశావు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?”

“వెన్నెల అంటే కలవలకు ప్రేమా? సూర్యకాంత పుష్పము సూర్యుణ్ణి కోరుతుందా? పుష్పము తేనెను కోరుతుందా? ప్రభూ! నన్ను స్వీకరించుకోండి. నేను మీ ప్రేమ భిక్ష లేనినాడు హోమం లోని నుసిని కదా!

“నేను ముప్పదియైదు ఏళ్ళ ముసలి వాడను. నువ్వు నవయౌవనంలోని పదునెనిమిదేళ్ళ మిసిమి పడుచువు.”

“ప్రేమకు ఈడుందా ప్రభూ?”

“నేను ఈ క్షణం నీ దేహాన్ని కోరితే నీ శీలం నలిపి వేసికొని నా కాంక్ష తీర్చగలవా?”

“ప్రభూ! మీ ప్రేమ, మీ దివ్యప్రణయము ఆశిస్తున్నాను. నా నాశనానికి వెఱవను. మీకు అర్పణ చేసుకోవడమే నా జీవితానికి పరమమోక్షము. ఇదిగోనా మూర్తి! నన్ను మీ హృదయానికి గాఢంగా గాఢంగా అదుముకోండి. నా విద్యలు మీవి; నాకలలు మీవి; నా ఆత్మ మీది.”

మా దేహం వణికిపోయింది. ఎంత పవిత్ర జీవన ప్రవాహము! ఆమెను తనివోవ బిగియార నా బాహువుల అదిమివేసి కౌగలించుకొన్నాను.

“కల్హారమాలికా! నన్ను వివాహంచేసుకోగలవా? నా ఆత్మేశ్వరీ! ఇట్టి మహదానంద సమయం కోసమేనా జిన

29