ఈ పుట ఆమోదించబడ్డది
'బాపిరాజు'
దేవుడు ఆ నాడు నన్ను రక్షించినాడు. నువ్వు నా కోసమే యిన్ని సంవత్సరాలు యెదురుచూస్తూ వున్నావా? ఈ నీ దివ్యమూర్తి నాదేనా? ఈ అద్భుతమైన మోము, భారమైన ఈ తలకట్టు, ఈ దివ్యలోచనాలు, శ్వేతతారాదేవి చేతిలోని కమలాలైన నీ యీ పవిత్ర వక్షాలు, నీ యీ పరమ దేహకాంతీ - నా వేనా? నువ్వు నా దానవేనా? జినప్రభూ! నీ కరుణ యిదేనా? రా! ఆత్మేశ్వరీ, రా! మోకరిల్లు. పరమశ్రమణకుడే మనని ఆశీర్వదిస్తాడు!”
“ఆ ప్రభుని దాసుడ నైన నేనున్నూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను - దివ్యదంపతులైన మిమ్ము” అని సత్యశీలాచార్య గురుదేవులు, లేచి ఆయన కడ మోకరిల్లాము.
30