పుట:Bhagira Loya.djvu/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భోగీరలోయ

పరవళ్లు కట్టి నన్ను ముంచి, సుళ్లలో తిప్పి, అతిలోతులకు లాగి, ఎక్కడకో విసిరికొట్టింది.

భయంకర మృగాలు ఆ అడవులలో సంచరించుతూ వుంటవనే మాట మరచిపోయి నేనే నిశాచరమైన వ్యాఘ్రము వలె ఆ చెట్ల నీడల్లో పడివుంటిని. రాత్రల్లా దూరాన తోడేళ్లు, చిరుతలు అరుస్తూ వున్న విషయమే గ్రహించ లేదు.

నాకు పెనుభూతాలు కనబడలేదు; పాముల బుసలు వినబడలేదు. విషపుచెట్టుయొక్క లేత ఆకు యెంత కోమల సుందరమై వున్నప్పటికీ, అది విషపూరితమే అయినట్లు, సౌందర్యం పుంజీభవించిన స్త్రీ మూర్తులన్నీ విషపూరితలే. ఈ విషయము సేవించిన్నీ దహించబడకుండా జినదేవుని కరుణ వల్ల ఒకనాడు బయట పడ్డాను. నేడు మళ్ళీ ఈ విష ప్రయోగం యే మహత్తర కారణం చేత నన్ను తాకిందో! అమిత జాగ్రత్తతో గమనిస్తూవున్న నా దీక్ష కర్కశహస్తాల పాలబడి, కటిక నేలబడిన మట్టి బొమ్మలా ముక్కలు ముక్కలైపోయింది. ప్రపంచానికి దూరంగా వుంది గదా అని ఈ సంఘారామానికి చేరాను. ప్రపంచమే తరుముకుని తరుముకుని, ఇంద్రుణ్ణి తరుముకు వెళ్లిన బ్రహ్మహత్యా పాతకంలా, నన్ను వెంబడించింది. ఏనాటి ప్రారబ్ధ మిది?”

ఆ బాలిక యెంత నిర్మల చరిత్రం నటిస్తూన్నది! అతి నిర్మలమైన నీళ్లు కలిగిన కాసారం లాంటి హృదయం కలిగిన

21