పుట:Bhagira Loya.djvu/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

మనిషిలా వుంది. ఆమె దివ్య సౌందర్యాన్ని రసపూర్ణమైన కళాస్వరూపం లోనికి దింపటానికి సమయాలు పాటింప నవసరం లేని దివ్యచిత్రమూర్తిత్వంలా వున్నది. ఇంత అందము విషపూరితమై వుండగలదా? ఆ ఇక్ష్వాకు బాలిక మాత్రం సౌందర్యవతికాదా? చలించిన ఈ నా మనస్సును కట్టివేయటానికి తపస్సులో నా మనస్సును పవిత్రం చేసికోవాలి.

ఇంతట్లో తూర్పుదెసను యెఱ్ఱజీరలు సాగినవి. ఏలాగో ఆశ్రమానికి చేరుకొన్నాను. ఈ బాలికకు యింక విద్య చెప్పకుండా వుండడానికి వీలులేదు. సత్యశీలాచార్యులవారి ఆజ్ఞ అనుల్లంఘనీయము. ఈ దివ్యవృద్ధుడు తన ఆజ్ఞతో నన్ను కట్టివేసినాడు. ఆ బాలికకు చదువు చెప్పమని నన్ను వొప్పించే సందర్భంలో యేవో విచిత్రమైన - భావగర్భితమైన మాటలన్నారు. ఆయన మాట లమోఘములు: సత్య స్వరూపములు. ఇప్పుడు జరిగినదంతా వారికి నివేదించి వారి యాదేశానుసారంగా నడుచుకోవటమే నా ధర్మం అని నిశ్చయించు కొన్నాను.

దర్శించిన మరుక్షణంలో సత్యశీల భిక్షాచార్యులవారు చిరునవ్వు నవ్వుతూ నన్ను కూర్చుండమని సైగచేసి, ‘నాయనా! నీలో శుభపరిణతి ఆసన్నమయ్యే ధర్మసమయం వచ్చింది. నీ సంఘసేవ సంపూర్ణత తాల్చాలి...’

“స్వామీ! నేను అవమానం పొందటమే ధర్మసేవా? వేళాకోళమే ఎరగని తమ మాట యీ రోజున యీలాగున

22