పుట:Bhagira Loya.djvu/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
'బాపిరాజు'
 

విరుద్ధముగా ఉన్నది. సమభంగాకృతిని త్రిభంగమూర్తి కడ కల్పించుట అపశ్రుతిభూయిష్ఠము.

ఇంతలో ఆ విగ్రహము కదిలి నెమ్మదిగా చేతులు జోడించి తలవంచుకొన్నది. అది మూర్తికల్పన కాదు; ప్రాణపూరితమైన బాలికామూర్తి. నా గుండె ముడుచుకొని పోయింది, విస్ఫారితమైపోయింది. మహావేగాన భేరీభాంకారాలు వాయించ నారంభించింది. చైతన్య రహితుడనై అట్లనే నిలుచుండిపోయాను.

ఆ సౌందర్యము అలౌకికము. ఆమెముఖాన నిశ్చలత్వము, ప్రజ్ఞాపరిమితత్వము, శాంతి, నిర్మలకోమలకాంతి, అత్యంత నిగూఢసత్యము తాండవమాడుతున్నాయి. స్త్రీ మొఖము చూడనన్న నా ప్రతిన నట్టేట సుడిగుండాలలో మునిగిపోయినది.

“నువ్వు దేవబాలికవా?” అని గబగబ ముందుకు బోయి ఆమెను ప్రశ్నించాను.

“ప్రభూ! - నేను - కల్హారమాలను - మాళవమంత్రి - కుమార్తెను -”

“నా శిష్యవా ? హ, హ, హ, హ...” అని వెడనవ్వు నవ్వుతూ చివాలున వెనక్కితిరిగి ఆ అడవులలోకి మహావేగాన వెళ్ళిపోయినాను. నా హృదంతరాళాల కారు చీకట్లు కానట్టి, వెలుగు కానట్టి శూన్యమేదో ఆవరించుకుంది. నా ఒళ్లు కంపించింది. నేను భరించలేని భయంకరానందము

20