భోగీరలోయ
యీ గాఢపవిత్ర వాంఛను భరించనూ లేను; తోలి వేయనూ లేను.”
“అదేమిటమ్మా వెఱ్ఱిబాలికా! ఇంక నీకు చిత్రకళ నేర్పే వారే లేరూ?”
నేను చటాలున లేచి కూచున్నాను. “స్వామీ! నేను అందరి చిత్రలేఖనాసామర్థ్యమూ పరిశీలించినాను. ప్రజ్ఞా రహితులదగ్గిర అభ్యాసము వున్న విద్య కొంచమూ నశింప జేసుకోడానికే గదా?”
“సరే నమ్మా! జ్యోత్స్నా ప్రియశిల్పాచార్యులవారిని నీకు చిత్ర విద్య నేర్పడానికి వొప్పించాను. కాని వారు కొన్ని నియమాలు కోరారు. వారు చిత్రిస్తోవుంటే వెనక నుంచి చూచి నేర్చుకోవాలట; ఎదుట బడకూడదు. వారు లేనప్పుడే గోడలపై చిత్రలేఖనము కల్పించాలట. అది వారు తర్వాత దిద్దగలరు. ఫలకాలపై రచించిన నీ చిత్రాల్ని వారికడకు సేవకులచేత పంపిస్తే వారు సరిచూడగలరు...”
“స్వామీ! ఏలాంటి నియమము శాసించినా సరే, నాకు చిత్రవిద్య ప్రసాదిస్తేచాలు. నేను ధన్యురాల్ని; నా జన్మం అంతా తరించింది.”
కులపతి సత్యశీలాచార్యులు వృద్ధత్వములోకూడా కాంతి వీడని తన కన్నులతో నవ్వుకొంటూ వెళ్ళిపోయారు.
ఈ వరము నా కేలా ప్రసాదింపబడింది! ఎంతటి అపూర్వ సంఘటన! ఈ భిక్షను, పూవు మధువును దాచు
17