Jump to content

పుట:Bhagira Loya.djvu/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

కొని సంభావించినట్లు యెంత పూజింపగలనో : తీగలలో స్వరాలు చేరినట్లు, వసంతంలో సౌరభాలు పొదువుకు పోయినట్లు నాలో ఈ శిల్పవిద్య హత్తుకు పోవాలిగాక!

4

త్వరలో శుభముహూర్తం చూసి నా కడ ఈ విచిత్రపద్ధతిని చిత్రవిద్యను అభ్యసింప దీక్ష వహించింది అబాలిక. ఆమెపేరు కల్హారమాల యట. విషాలు హృదయాలల్లో దాచుకొన్న ఈ పాపజన్మలకు, మారపిశాచి ఆయుధాలకు చక్కని పేర్లుమాత్రం పెడ్తారు వెఱ్ఱివాళ్లయిన పురుషులు. జినదేవుడు స్త్రీత్వంతో లోకాలు ఎందుకు మలినంచేశాడో! బుద్ధ దేవునికి పవిత్రమైన ఆ నలభైరోజుల మహాతపస్సులో జరిగిన పరీక్ష నాకు ఎన్నిసంవత్సరాలు జరుగనుందో.

ఆ బాలిక రచించే చిత్రాలల్లో ప్రజ్ఞ ఉన్నది. వర్ణ జ్ఞానమూ బాగానే తెలుసును ఆడవాళ్లు రేఖానైపుణ్యం ఎలా సంపాదించుకోగలరు చెప్మా. ఈ చిన్నది తీరైనరేఖలు ప్రవహింపజేస్తో వుంది. ఎక్కడో తప్పువస్తూ ఉన్నది, నిజమే కొందరు విద్యార్థులు ఇన్ని సంవత్సరాలు నేర్చుకుంటూ గూడా ఇప్పటికీ రేఖాశక్తి అలవడజేసుకో లేకుండా ఉన్నారు. ఆమె కుంచెలు ఆమే కట్టుకుంటుందిట - విచిత్రమే. అతిలలితాలైన వేళ్ళల్లో శక్తి ఉండదుకదా! ఈ బాలిక వేళ్లు పురుషునివేళ్లల్లా ఉంటవేమో. ఆ బాలికే పురుషునిలా

18