'బాపిరాజు'
లోని స్త్రీ పురుష చిత్రమండల మంతా నా వైపే కరుణ హాసావలోకనములతో పరిశీలిస్తున్నది. నా మంచానికి దగ్గిరగా మహాగురువు సత్యశీల భిక్షాచార్యులవారు కాలాతీతమైన స్వరూపంతో, పరమదయను ప్రసరించే వెన్నెలలు నింపే చూపులతో, ఆ ముదుసలి పెదవుల వరపూరితమైన నవ్వుల వెలిగిపోతూ వుండగా చూస్తూవున్నారు.
మత్తు నెమ్మది నెమ్మదిగా విడిపోయి బుద్ధి నిర్మలమై లోకజ్ఞానమువచ్చి చటాలున లేచి నిలుచుంటిని. పడబోయిన నన్ను మా వృద్ధదాసి పట్టుకొని “ఆచార్యులవారికి నమస్కారము చేయి తల్లీ,” అని ఉపదేశించింది.
ఆ వృద్ధాచార్యుల పాదాలకడ మోకరిల్లి పోయినాను.
“అమ్మాయీ! నీ దీక్షకు చాలా సంతోషము. ఎందుకమ్మా శిల్పమంటే నీకింత మమకారము?”
“స్వామీ! .......”
“ఊరడిల్లి చెప్పమ్మా, తల్లీ! తొందరలేదు.”
దాసీజనము భక్తితో కొనివచ్చి అర్పించిన పీఠముపై శాంతపవిత్రులైన ఆ వృద్ధ భిక్షులు అధివసించినారు. ఆయన కడనే తలవంచి కూరుచున్నాను.
నా గొంతులో నుండి వినబడీ వినబడని స్వరము మాత్రమే ప్రవహించినది.
“స్వామీ! చిత్రకళ నేర్చికోని నాడు నా జన్మం వృథా! నా పూజ నుసి అయిపోతుంది. నే నింక తీరని
16