'బాపిరాజు'
మా నాన్నగారికి అక్కణ్ణుంచి నాకు మల్లేనే బెంగ పట్టుకుంది. ఆరునెలలు సెలవు పుచ్చుకున్నారు. మేం అంతా మా స్వంత గ్రామం వెళ్ళాం. గోదావరి తీరాన్న నేను రోజూ విశ్రాంతికి వెళ్తూ వుండే వాణ్ణి.
ఒకనాడు నేనూ మా నాన్నగారూ మా మేనమామా యింకా యింకా యితర చుట్టాలూ వూళ్ళో వుండే పెద్దలూ అందరూ మా మేడ మీద కూర్చుని తాంబూలాలు వేసుకుంటూ వున్నాము. ఆ సమయంలో మా నాన్నగారు చటుక్కున లేచి కిందికి దిగివెళ్లారు. నాకు ఏమిటో భయం వేసింది. ఒళ్లు పులకరించింది. కూడా మేడ దిగి నేనూ వెళ్లాను. ఇద్దరం పడమటింటిలోనికి వెళ్లాం. అక్కడ అలుకులు, ముగ్గులు లేకుండా పూజ అరుగుంది. మా నాన్నగారికి కళ్ళనీళ్లు వచ్చి దేవతార్చనంపెట్టెలు కలశాలు వున్న అలమారు తలుపు తాళం తీసి, తెరిచారు. అందులో ఏమిటో ప్రాణం లేనట్టే వుంది. అన్ని విగ్రహాలూ వున్నాయి.
"బాబాయి రాగిసెమ్మా యేది?"
"ఏ రాగిసెమ్మా?"
"కుంభకోణం రాగిసెమ్మా"
"అవునవునండి ఏదీ? అడగనాండి మావయ్యనిపిలిచి?" ఎంతమందిని కనుక్కున్నా యెక్కడాలేదు.
అప్పణ్ణుంచి మా నాన్నగారు దీపం సెమ్మా కోసం లోకాలు తల్లక్రిందులు చేయడం మొదలు పెట్టారు.
124