దీపం సెమ్మా
ఆ దేవతార్చనం పెట్టె నెమ్మదిగా మా స్వంత గ్రామంలో వుంచేసాం. ఇల్లా వుంటూవుండగా మా అమ్మకు జ్వరం ప్రారంభం; సంధిలోకి దింపింది. ఎంతమంది గొప్ప వైద్యులు ప్రయత్నాలు చేసినా మా అమ్మ మమ్మల్ని తీరని దుఃఖంలో ముంచి వెళ్ళిపోయింది.
ఆ తరవాత మా యింట్లో దొంగలు పడి పదివేల రూపాయల ఆస్థి దోచుకొని పోయినారు. మా చెల్లెలుకు కలరా వచ్చి మూడేళ్లకిందట కాలం చేసింది. అప్పుడే జడ్జీ పని అయింది మా నాన్నగారికి.
నేను బాగా పరీక్షల్లో కృతార్థుణ్ణి అవుతో వుండేవాణ్ణి. అల్లాంటిది బి యె. పరీక్షకు వెళ్ళాలంటే జబ్బు. మూడేళ్లు ప్రయత్నం చేశాను కాని లాభం లేకపోయింది. నాకు ఎంతో ఏడుపువచ్చింది. మా నాన్నగారి దగ్గరకి వెళ్ళాను.
"నాన్నగారూ యింక నేను చదువు మానేస్తా"
"పోనీలే! చదువు కేమి గాని మంచి బలంగా వుండే వాడివి నీకు కళ్ళు గుంటలుపడ్డాయి. బెంగా?"
"నాకు... ...ఏమీ తోచదండి. రెండుమూడుసార్లు ఆత్మహత్య చేసుకుందాం అని అనిపించింది."
"ఛా! వట్టి వెఱ్ఱివాడవులా వున్నావు. మొన్న డాక్టరు విశ్వనాధరావుగారు ఏమి చెప్పారు?"
"ఆయన నాతో ఏమీ చెప్పలేదు మీ తోనే మాట్లాడుతాను అన్నాడు."
123