పుట:Bhagira Loya.djvu/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
'బాపిరాజు'
 

ఆ పిల్లని తన కొడుక్కి చేసుకున్నాడు. ఆ పిల్ల ఒక్కతె సంతానం గనక తండ్రి ఆస్తి అంతా మా నాన్న తాతయ్య తాతయ్యకు వచ్చిందిరా బాబూ."

2

మా తాతయ్య తాతయ్య తెచ్చిన ఆస్థిలోకల్లా ముఖ్యమైందే ఈ రాగి దీపం సెమ్మా. ఆ సెమ్మాతోనే వచ్చిం దాస్థి ఆవిడ తండ్రికి. గుంటూరు సీమనుంచి రెడ్ల ప్రభువుల రాయబారిగా వచ్చా డాయన ఆర్కాటు నవాబు దగ్గిరకు. ఒక రోజున ఆయన ఆ వూళ్లో తిరుగుతూ వుండగా అంగడివీధిలో ఈ సెమ్మా అమ్మకానికి వచ్చింది. ఆ సెమ్మా కళకళలాడుతూ దివ్యంగా కనపడింది ఆయనకు. మాట్లాడకుండా అడిగినంత డబ్బిచ్చి కొనుక్కొచ్చి ఆయన దేవతార్చనంపెట్టె దగ్గిర పెట్టాట్ట.

ఆ సెమ్మా శిల్పం పని అతి అందంగాను, నాజూకు గాను, అద్భుతంగాను వుంది. కిందమట్టు కమలం, అందులోంచి కాంతి తీగలా కలశాలు, చక్రాలు, కమలాలు, తీగెలు, తామరకాయలా పై కెదిగి అష్టదళ పద్మములా సెమ్మా ప్రమిద తెలిసింది. ఆ ప్రమిద మధ్య నుంచి ఒక తీగ పైకి పోయింది. ఆ తీగె చివర ఒక హంస చాలా ఒయ్యారంగా నిలిచి వుంది. ఆ హంస మీద సంపూర్ణ ప్రపుల్ల కమలం, దాని మీద పద్మాసనాసీన ఐన లక్ష్మీ-సరస్వతీ, చతుర్విధ

120