పుట:Bhagira Loya.djvu/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీపం సెమ్మా

పురుషార్ధాలు, విజ్ఞానవీణ, తాళాలు, అష్టహస్తాలతో పట్టుకొని హాసవిలాసంగా వున్న వదనంతో వెలిసి వుంది.

ఆ సెమ్మాలో ఆవు నెయ్యి గాని యింకోటి పోసేందుకే వీలులేదు. పమిడిపత్తి వత్తులు పెట్టి దీపం వెలిగిస్తే ఐశ్వర్యప్రదమైన వెలుగులు వెదజల్లుతూ, దేవతార్చనం పెట్టెలో వున్న దేవతల విగ్రహాలు ప్రాణశక్తులతో ప్రత్యక్ష మయ్యేటట్లుగా వెలిగేది.

ఆ సెమ్మా దేవతార్చనంపెట్టె దగ్గిరకు వచ్చి నప్పటి నుంచి ఆ బ్రాహ్మణుడికి వచ్చిన తెలివి తేటలు అద్భుతం. రాజకీయంలోనేకాకుండా శాస్త్రాల్లో, కవిత్వంలో అన్నిటిలో ఉత్సాహం కలగడం వాటిలో మాంచి ప్రజ్ఞకూడా కలగడం ఆరంభించింది. నవాబుగారికి ఆయనంటే గాఢం అయిన ప్రేమ కలిగి నిక్షువుదోసిళ్లు యివ్వడం ప్రారంభించాడు.

అల్లా రెండేళ్ళు జరిగింది. కుంభకోణం వెడదామని ఆయన యిల్లాల్నీ కూతుర్నీ వెంటబెట్టుకొని దేవతార్చనం పెట్టె తీసికొని, బలువని ఆ రాగిసెమ్మా మాత్రం వదిలిపెట్టి బయలుదేరాట్టాయన.

అది బెడిసికొట్టింది కాబోల్ను. కుంభకోణం వెళ్లాడో లేదో భార్యభర్తలకిద్దరికి కొంచెం జ్వరం వచ్చి, సంధి పుట్టి కూతురికి జననీజనకుల్ని యెడబాపిపోయారు.

వారి కుమార్తెను మా తండ్రి తాతయ్య తాతయ్యకు యిచ్చి వివాహం చేసినప్పుడు వారి ఆస్థితోపాటు రాగానే మా యింట్లో దేవతార్చనం దగ్గిర వెలిగిపోవడం ప్రారం

121