పుట:Bhagira Loya.djvu/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దీపం సెమ్మా

కొడుకు యిక్కడ రెండేళ్ళ కిందట రెడ్డిప్రభువుల పనిమీద వచ్చాడు. భార్యాకూతుళ్లనుకూడా తీసుకువచ్చాడు. ఆర్కాటు నవాబుల కొలువులో రెండేళ్లు వుండి చిదంబరం మొదలైన క్షేత్రాలు సేవిస్తూ వచ్చాడు యీ వూరు. ఇక్కడ రెండు నెల్ల క్రితం జబ్బుచేసి నా కుమారుడూ, మహాపతివ్రత కోడలూ నన్నూ యీ కసుగాయసూ దిక్కులేని వాళ్లని చేసి వెళ్లిపోయారు' అందిట. ఆమె పట్టలేక ఏడుస్తుంటే నలుగురూ మూగారట. మా తాతయ్య తాతయ్య తాతయ్యకు కూడా కన్నీళ్లు తిరిగి, వాళ్లని కోవిల్లోకి తీసుకుపోయి ఓ మండపంలో కూచోమని, తానూ కూచుని, వాళ్ల పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్నాడు.

కొడుకూ కోడలూ పోగానే రెడ్డి ప్రభువుల కా కబురంది ఆ ముసలమ్మకి కబు రంపా రట. ఆవిడ తక్షణం బయలుదేరి రామేశ్వరం వెళ్ళే జట్టును ఒకదాన్ని పట్టుకొని కుంభకోణం చేరిందట. తల్లిదండ్రు లిద్దరూపోగానే ఆ పిల్ల అస్తమానం ఏడుస్తూ బెంగపెట్టుకు పోయిందట. పాపం ఆ వూళ్లో వున్న పెద్ద సంపన్న గృహస్థు డో అయ్యరు ఆ పిల్లను తన ఇంట్లో వుంచుకున్నా అరవంరాక బెంబేలెత్తిపోయిందట. వాళ్ల బామ్మ రాగానే ఒక్క ఉరుకురికి కౌగలించుకొని మూర్ఛ పోయిందట."

"తాతయ్యా నాకూ ఏడుపు వస్తోంది"

మా తాతయ్య తాతయ్య తాతయ్య వాళ్లనితీసుకొని మన వూరు తీసుకు వచ్చాడు. కులగోత్రాలన్నీ చూసుకుని

119