Jump to content

పుట:Bhagira Loya.djvu/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'బాపిరాజు'

"రఘునాధాభ్యుదయ మను మహాకావ్యాన్ని ఆమె రచియిస్తున్నది. శ్లోకస్వరూపాన అమృతమే రూపెత్తిన రసవత్తర మయిన కావ్యం సుమాండి అది."

"ఔను, ఆమె యశము, కృష్ణాగోదావరీ తీరాలవరకు వ్యాపించింది."

6

శ్రీ రఘునాథమహారాజు సైన్యాలు జైత్రయాత్ర సాగించి ఆషాఢ శుద్ధ పంచమినాడు తోపూరునందు ఆంధ్ర సామ్రాజ్యం విచ్ఛిన్నం చేయదల్చుకొన్న గొబ్బూరి జగ్గరాయలతో తలపడి, షష్ఠినాడాతనిని యుద్ధంలో సబంధుకంగా సమయించినవి. మహాసైన్యం వ్యూహరచనయందు, యుద్ధము నందు అతిరథుడయిన రఘునాథరాయలు, ధర్మరాజు తన సహోదరుల సహాయం పొందినట్లు, నాగమనీడు, యాచమనాయుడు మొదలయిన మహావీరుల సహాయముతో శత్రు సేనలను నుగ్గాడి విజయలక్ష్మికంఠమునందు పరిగ్రహణ పుష్పమాల వైచినాడు.

ఆ యుద్ధంలో శ్రీమంతు నాగమనీడు ప్రభువున్ను, ఆతని దళవాయి జగ్గన్నమంత్రియున్ను చూపించిన పరాక్రమము ప్రభువయిన రఘునాధరాయలు నిండు సభలో మెచ్చుకొన్నాడు. రఘునాధరాయని సచివులలో ఒకరయిన చెంగల్వల ప్రకాశకవిమంత్రి (విజయరాఘవ నాయక వంశావళి కావ్యము రచించిన చెంగల్వల కాళకవి దగ్గర జ్ఞాతి) జగ్గన్న

114