జగ్గన్నగంటం
ఆథునిక గ్రంథాలు అనేక రకాలయిన వ్రాతలలో తాటాకుల మీద విన్యాసమై ఉన్నవి. సరస్వతీమందిరము గ్రంథరత్న భాండాగారమే గాదు, అనేక దివ్యత్వాలు సదా ప్రత్యక్షమై సభ తీర్చియున్న పావనభూమి యది. కర్కశులై రాక్షసత్వము వహించగల్గిన మనుష్యులు తమ దివ్యత్వం లోంచే గ్రంధాలు వ్రాయగల్గినారుగాబోలు! మనుష్యునిలో దివ్యత్వం ఏ ఆజ్ఞాచక్రంలోనో దాగి ఉంటుందా ?
జగ్గన్నమంత్రి ఇంటి దగ్గర, పూజా పీఠంమీద వున్న తన గంటాన్ని తలుచుకొన్నాడు. తనకు గ్రంథాల్ని చూపిస్తూన్న గ్రంథాలయాథిపతిని "స్వామీ ! శ్రీరఘునాధ భూపాలుడు రచించిన గ్రంథాలు ఒక్కసారి నాకు చూపించగలరా?" అని ప్రశ్నించినాడు. "ఆ పెద్దపెట్టెలో వున్న దంతపు పేటికలో మహారాజు రచించిన రామాయణ గ్రంథమున్నది. ఆ రజతపేటికలో నున్న పుస్తుకము రఘునాధ మహారాజు కృతమైన వాల్మీకి చరిత్రము. ప్రభువులు ఇప్పుడు మహాభారత తాత్పర్యసంగ్రహము రచిస్తున్నారు. ఈ పెద్ద పెట్టెలోనున్న దంతపేటికలలోని గ్రంథాలన్నీ రఘునాథ ప్రభువుల వారికి అంకితము లిచ్చినవి. అది విజయవిలాసము. అది అలంకార రత్నాకరము. ఇది సాహిత్య రత్నాకరము. యజ్ఞనారాయణదీక్షిత మహాకవి రచించినది."
జగ్గన్న -- "రామభద్రాంబికాదేవి అద్భుతమైన కావ్యాన్ని సృష్టిస్తున్నారని వినికిడి."
113