పుట:Bhagira Loya.djvu/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'బాపిరాజు'

ప్రభువు, మల్లేపద్ది సింగమరెడ్డి, చలసాని అచ్యుతరామనీడు, కంఠంనేని వాసుకేశ్వరనీడు, వేములపల్లి దుర్గారాయలు, అరజా పిన్నమనాయకుడు, తలుపుల గండ్రయ్యనాయకుడు, గండు శోభనాద్రిరెడ్డి, నెరుసు బ్రహ్మన్ననాయకుడు, తోట భైరవన్న, మన్నీలుగ, చమూపతులుగ, అశ్వదళవాయిలుగ, గజయూధ నాయకులుగ కూడరా కడలిపురం వేంచేసినారు.

మంచి ముహూర్తం చూసి శ్రీమంతు నాగమనీడు ప్రభువు మహాక్షేత్రమయిన కడలిపురంలో వేంచేసియున్న కులదేవుడైన శ్రీ దుర్గానాగేశ్వరస్వామివారి కడకుపోయి బ్రహ్మవాసుకి, తక్షక, కర్కోటకాది పవిత్ర కృష్ణోదకాల కృతావ గాహులై స్వామివారికి మహాన్యాసపూర్వకమైన యేకాదశ రుద్రాభిషేకములు చేయించినారు. సహస్ర నారికేళాభిషేకములు, బంగారుకలశాల కొలదీ పంచామృతాభిషేకాలు జరిగినవి. జ్యేష్ఠ శుద్ధ పంచమి గురువారంనాడు నాగమనీడు ప్రభువులు నాగేశ్వరస్వామివారి యెదుట విజయ చిన్హముగ అఖండమును వెలిగించి శుక్రవారం నాడు దుర్గామ్మవారికి సహస్రనామ కుంకుమార్చన చేసి శు|| యేకాదశి బుధవారంనాడు సర్యసైన్యాలతో కదలి శివగంగలో వేంచేసియున్న కులదేవతయయిన మహిషాసురమర్దనిని సర్వ దేవతలతోగూడ కొలిచి చక్రవర్తి వరాహలాంఛన పతాకము ఎత్తించి విజయ ఐరావతనామ మత్తగజముల నెక్కి తంజావూరు చేర వెడలినారు.

110