Jump to content

పుట:Bhagira Loya.djvu/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జగ్గన్నగంటం

ప్రభువు :- రఘునాధరాయలు మహారాజులుంగారి ఆజ్ఞప్రకారం మేము సైన్యం తీసుకొని తంజావూరు వెళ్ళుతున్నాము. మా సైన్యం నడుపుతూ మాకు కుడిచేయిగా ఉండడానికి మీరు మాతో తంజావూరు రావాలని ఆశిస్తున్నాము.

రామ :- ఏలినవారి నమ్మకానికి కృతజ్ఞుణ్ణి. పంట పండించుకొనే యీ నిరుపేద పారుడు సైన్యాలు నడపడంలో తమకు ఏమాత్రం సహాయంగా ఉండలేడని నమ్ముతున్నాను.

అడవి మాచన్న మంత్రి :౼ రామన్నమంత్రిగారూ ! కర్షకత్వంలో దక్షత చూపగలవాడే కదనరంగంలో గండర గండడై ముందుకు నడవగలడు. తమరు ఏలినవారు కాన్క నిచ్చే తాంబూలం పరిగ్రహించాలని మనవి చేస్తూన్నాను.

రామ :- నేను పెద్దవాడ్నయ్యాను. మాచన్న మంత్రి గారూ ! నే నింటి దగ్గర కృష్ణా - రామా అంటూ నాగేశ్వరస్వామివారిని భజిస్తూ ఉండవలెను. మా పెద్ద అబ్బాయి యుద్ధంఅంటే చాలా కుతూహల పడుతున్నాడు. సహాయదళవాయిగా కాకపోయినా చిన్న చమూపతిగానన్నా తీసుకొని వెళ్ళవచ్చును. దళనాయకుడుగా ఉండడానికి నిజమయిన ప్రజ్ఞానిధి యతడే నని మనవి చేస్తున్నాను.

జగ్గన దళవాయిగా శుభముహూర్తంలో నాగమనీడులం వారి చేత అభిషేకింపబడ్డాడు. నాల్గువేల కాల్బలంతో నూఱు ఆశ్వికదళంతో 10 ఏనుగులతో దేవరకోట సంస్థానాధిపతిన్నీ శ్రీమంతుడును అయిన నాగమనీడు

109